calender_icon.png 7 January, 2026 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా 10కే రన్

05-01-2026 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 4 : పలు సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న హృద యం ఫౌండేషన్ హైదరాబాద్ లో 10కె రన్ నిర్వహించింది. డోస్ అప్ ఆన్ స్పోర్ట్స్.. నాట్ ఆన్ డ్రగ్స్ నినాదంతో నిర్వహించిన ఈ రన్ ను మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూ బెన్స్, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి ప్రారంభించారు. వందలాది మంది రన్నర్లు ఉత్సాహంగా  పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజానికి మహమ్మారిలా మారి న డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈ రన్ ను నిర్వహించామని హృదయం ఫౌండేషన్ ప్రెసి డెంట్ మధుకర్ చెప్పారు.

కరోనా సమయం నుంచీ తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని, డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని డాక్టర్ ప్రీతి రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఇలాంటి చక్కని ఈవెంట్ నిర్వహించిన హృదయం ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధుకర్ ను ప్రత్యేకంగా అభినందిం చారు. విజేతలుగా నిలిచిన రన్నర్స్‌కు లక్ష రూపాయల ప్రైజ్ మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రోలర్ స్కేటర్ స్టీఫెన్ పాల్ కిలారి, మిస్ యూనివర్స్ తెలంగాణ కస్వి, ఫిట్ నెస్ ఇన్ ఫ్ల్యుయెన్సర్ హిమాని సిసోడియా పాల్గొన్నారు. 10కె రన్ విభాగంలో మొహిత్ చౌదరి, సల్మాన్, మహేశ్ , 5కె రన్ విభాగంలో ఇనాయత్, మహేశ్, కార్తీక్ విజేతలుగా నిలిచారు.