calender_icon.png 22 July, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి నా లక్ష్యం

22-07-2025 04:27:21 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ కార్పోరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించనున్న అధునాతన పార్క్ నిర్మాణపు  పనులకు, శ్రీనివాస కాలనీలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో రూ.10 లక్షల ముడా నిధులుతో నిర్మించనున్న షెడ్ నిర్మాణపు శంకుస్థాపన చేశారు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ను కార్పోరేషన్ గా రూపాంతరం చేయడం జరిగిందని, మహబూబ్ నగర్ కార్పోరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమన్నారు.

అందుకే నగరంలో అన్ని  వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మార్పు ఇప్పుడే మొదలైందన్నారు. అభివృద్ధికి అందరూ మద్దతు తెలియజేయాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, నాయకులు సిజే బెనహార్, వెంకటేష్ గౌడ్, రామస్వామి, కిరణ్ కుమార్, ఇమ్మడి పురుషోత్తం, సిహెచ్ మంజుల, సిహెచ్ జ్యోతి, రఘురామిరెడ్డి, మురళీ గౌడ్, వెంకటయ్య, రమేష్, సిఎంఓ బాలు యాదవ్, రవికుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.