calender_icon.png 22 July, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతగా వేయండి

22-07-2025 04:38:42 PM

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): సీసీ రోడ్లను నాణ్యతగా వేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. మంగళవారం పట్టణంలోని భూలక్ష్మికాలనీలో పబ్లిక్ హెల్త్ నిధుల ద్వారా రూ.46 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణపు పనులకు, వేంకటేశ్వర కాలనీ హాయగ్రీవ టెంపుల్ దగ్గర గల పార్క్ ను 10 లక్షల రూపాయల ముడా నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో  మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, అభివృద్ధి లక్ష్యంగా కంకణ బద్ధులమై పనిచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు వినోద్ కుమార్, కృష్ణకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కుమార్, రియాజ్, శాంతన్న యాదవ్, గోపాల్ యాదవ్, యాదన్న యాదవ్, రాములు యాదవ్, పెద్దగొల్ల నర్సింహులు, రమేష్ యాదవ్, సూదన్న యాదవ్, నర్సింహులు యాదవ్, రాజగోపాల్ యాదవ్, అంజన్న యాదవ్, గోవింద్ యాదవ్, ఇమ్మడి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.