calender_icon.png 22 July, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట రైల్వే స్టేషన్‌లో 4వ ఫ్లాట్ ఫాం నిర్మించాలి

22-07-2025 04:45:37 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌(Mahabubabad Railway Station)లో కొత్తగా ఏర్పాటు చేసిన మూడు, నాలుగో రైల్వే ట్రాక్ వద్ద కొత్తగా ప్లాట్ ఫామ్ నిర్మించాలని సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి అధికారులను కోరారు. మానుకోట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సీపీఐ నేతలు మంగళవారం రైల్వే స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ, కొత్త బజారు నుండి రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు నాలుగవ ప్లాట్ ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రయాణికుల సౌకర్యాల కల్పన కోసం సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక భగత్ సింగ్ విగ్రహం వద్ద సిపిఐ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వీరవెల్లి రవి, గాదం శ్యాంప్రసాద్, యాదవ్, డోనికెని రమేష్, వంగూరి నాగేంద్రబాబు పాల్గొన్నారు.