14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

బీఆర్‌ఎస్‌కు శ్యామ్‌రావు రాజీనామా

03-02-2026 01:03 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీకీ ఎదురుదెబ్బ తగిలింది. బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అనుచరుడు, నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ లెండుగురే శ్యామ్ రావు తన అనుచరులతో కలిసి సోమవారం ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్యామ్ రావు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీలో బహుజన వర్గాలకు అన్యాయం జరుగుతోందని, అందుకే పార్టీని వీడుతున్నట్లు  తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు.