03-02-2026 01:04:47 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రసార సాధనాలు, దినపత్రికలలో వచ్చే అభ్యర్థుల ప్రచారంపై ప్రత్యేక నిఘా చేపడుతున్నట్లు మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు అలోక్ కుమార్ తెలిపా రు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మీడి యా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమి టీ, మీడియా సెంటర్ను సందర్శించి రికార్డులు, ప్రచార అంశాలను పరిశీలించారు. అభ్యర్థులు ప్రచార సభలు, ర్యాలీలు, ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికలపై సమాచారం కోసం 8328129551 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ పాల్గొన్నారు.