హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జీగా శ్యామ సుందర్
హుజూర్ నగర్, ఏప్రిల్ 17:భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎన్ శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంతకు ముందు హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన రా ధాకృష్ణ చౌహాన్ పదోన్నతిపై బదిలీ కాగా అప్పటి నుండి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పోస్టు ఖాళీగా ఉండగా కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఇన్చార్జి జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.
దీనితో ఖాళీగా ఉన్న సీనియర్ సివిల్ జడ్జి పోస్టును హైకోర్టు భర్తి చేసింది. ఈనెల 25లోపు నూతన న్యాయమూర్తి తన బాధ్యతలను స్వీకరించాలని హై కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలను తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.






