మంగ్లీపై ఆరోపణలు సరికాదు
18-04-2026 12:34 AM
మఠంపల్లి, ఏప్రిల్ 17 :ప్రముఖ గాయని మంగ్లీ ఫై సంబంధం లేని కేసులలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆమె పరు వు ప్రతిష్టలను భంగాపరిచేటువంటి కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని మఠంపల్లి మం డల గిరిజన శక్తి అధ్యక్షుడు బానోతు ఈశ్వర్ నాయక్ తెలిపారు.
శుక్రవారం వారు మాట్లాడుతూ ఎక్కువ ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేసిన సూత్రధారులైన రమావత్ మధు,హే మ కాంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులను న్యాయం చేయాలని కొ రారు.ఒక మారుమూల తండా నుంచి అంతర్జాతీయ స్థాయికి పేరు ప్రాముఖ్యతలు పొం దిన మంగ్లీ పై నిరాదనమైన ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి వెంటనే మానుకోవాలి హెచ్చరించారు .






