calender_icon.png 11 August, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్‌వీల్స్ ట్రాక్టర్ తో రోడ్లపైకి వస్తే సీజ్ చేస్తాం

11-08-2025 06:40:24 PM

ఎస్సై మధుసూదన్ రెడ్డి..

కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కల్హేర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సై మధుసూదన్ రెడ్డి(SI Madhusudan Reddy) మాట్లాడుతూ... మండల పరిధిలోని బీటి రోడ్లు, డాంబర్ రోడ్డుపై కేజ్‌వీల్స్ ట్రాక్టర్ లను నడిపిస్తే రోడ్డు దెబ్బతిని త్వరగా గుంతలుగా మారి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. లక్షల ప్రజాధనంతో నిర్మించిన రోడ్లను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యతని, ట్రాక్టర్ యజమానులకు ముందస్తుగా పోలీసు వారి హెచ్చరిక. ట్రాక్టర్ లు కేజ్‌వీల్స్ తో రోడ్లపైకి వచ్చినపుడు పట్టీలు వేసుకొని నడపాలని ఎస్సై మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టిలు లేకుండా కేజ్‌వీల్స్ తో ఎవరైనా అలాగే నడిపిస్తే ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్సై మధుసూదన్ రెడ్డి అన్నారు.