11-08-2025 06:33:55 PM
వలిగొండ (విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... నులిపురుగులతో పిల్లలో శారీరక, మానసిక అభివృద్ధి చెందకపోవడం, రక్తహీనత కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలెందర్ రెడ్డి, ఎంఈఓ భాస్కర్, డాక్టర్లు సాయి, శోభ, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసిద్ధి, ఉపాధ్యాయలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.