calender_icon.png 17 November, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కీ డ్రా విజేతలకు వెండి బహూకరణ

17-11-2025 12:00:00 AM

ఎస్‌కేటీ గ్రూప్స్ ఆధ్వర్యంలో అందజేత

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూ డెం, భద్రాచలం, మణుగూరులో ఆదివారం ఎస్‌కేటీ గ్రూప్స్ వారి ఎస్‌కేటీ కన్‌స్ట్రక్షన్స్, ఎస్‌కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వన స మారాధనకి హాజరైన మహిళలకు లక్కీ డ్రా నిర్వహించారు.

విజేతలైన మహిళలకు మొ దటి బహుమతిగా 30 గ్రాముల వెండి, రెం డవ బహుమతిగా 20 గ్రాముల వెండి, మూడో బహుమతిగా 10 గ్రాముల వెండి బహుకరించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మహిళలందరికీ బ్యాగులు అందజేశా రు. కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం లో జరుగుతున్న ఆర్య వైశ్య, కమ్మ, మున్నూరుకాపు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాల్లో ఎస్‌కేటీ గ్రూప్స్ వారు ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు, ఎస్‌కేటీ గ్రూప్స్ అధినేత దోసపాటి వెంకటేశ్వరరావు, దోసపాటి రాము, దోసపాటి క్రాంతికుమార్ పాల్గొన్నారు