17-11-2025 12:00:00 AM
-ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌పై అవగాహన
-ఆరంభ దశలో గుర్తింపు అత్యవసరం: డాక్టర్ పవన్ అడ్డాల
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో యుక్త వయసులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు గణ నీయంగా పెరుగుతున్నాయని, దీనిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని మెడికవర్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పవన్ అడ్డాల తెలిపారు.
సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజల్లో అవగా హన కల్పించేందుకు నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పవ న్ మాట్లాడుతూ.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తారని, ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం తీవ్రమైన ప్రమాదంగా మారు స్తుం దని చెప్పారు.
భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 15,000 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, తెలంగాణ లో ఈ సంఖ్య పెరగడానికి ఆధునిక జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక మద్యం సేవ వంటి కారణాలు దోహదపడుతున్నాయని తెలిపారు. ఆరంభ దశ లోనే నిర్ధారణ చేస్తే, ప్రత్యేక చికిత్స ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించి, రోగుల జీవన కా లాన్ని పెంచవచ్చని డాక్టర్ పవన్ అడ్డాల తెలిపారు.
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అమలు చేయడం, జాగ్రత్తలు పాటించడం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం అని సూచించారు. కార్యక్రమంలో అనేక మంది పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు.