15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రేవంత్‌రెడ్డి జాగీరుగా సింగరేణి

07-02-2026 12:27 AM

రూ.6 వేల కోట్లను బామ్మర్దికి కట్టబెట్టిన ఘనుడు

కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు

కాంగ్రెస్, బీజేపీ కలిసే సింగరేణి ప్రైవేటీకరణ

ఈ ఎన్నికల్లో కారుకు ఓటేసి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పన్ను రద్దు చేయని బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు

మాజీ మంత్రి హరీశ్‌రావు

మంచిర్యాల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): సింగరేణిని సీఎం రేవంత్‌రెడ్డి తన జాగీరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ రేవంత్‌రెడ్డి జాగీరా లేక ఆయన బామ్మర్ది సొత్తా అని ప్రశ్నించా రు. ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ పేరిట రూ.6 వేల కోట్ల కాంట్రాక్టులను తన బామ్మర్దికి కట్టబెట్టి కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణి సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు ఫుట్‌బాల్ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో మంచిర్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ నిర్మించారని గుర్తుచేశారు. సింగరేణి కార్మికుల 3,200 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి భూముల విలువ పెంచారని తెలిపా రు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 17,600 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.

మంచిర్యాలలో ఓటుకు రూ.5000 పంచేందుకు సింగరేణి డబ్బును దోచి పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు డబ్బు తీసుకున్నా ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్న సీఎం అహంకారానికి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. సింగరేణిలో ఓబీ టెండర్లలో అవినీతి జరుగుతోందని, గతంలో మైనస్ శాతంలో ఉండగా ఇప్పుడు ప్లస్ శాతం పెట్టి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్ పాలనలో మెడికల్ బోర్డుల ద్వారా అనారోగ్య కార్మికులను అన్యాయంగా రిజెక్ట్ చేస్తున్నారని విమర్శించారు.

మంచిర్యాలలో పోలీ సులు అతిగా వ్యవహరిస్తూ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, రెండేళ్లలో మళ్లీ కేసీ ఆర్ ప్రభుత్వమే వస్తుందని హెచ్చరించారు. సింగరేణి కార్మికులపై ఆదా య పన్ను రద్దు చేయని బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాయని ఆరోపించా రు. మంచిర్యాల జిల్లా కొనసాగాలన్నా అభివృద్ధి జరగాలన్నా బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఒక్కసారి మోసపోయామని, మళ్లీ మోసపోవద్దని చెబుతూ కారు గుర్తుకే ఓటు వేయా లని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు.