calender_icon.png 22 December, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి "ఉత్సవాల జెండా ఎత్తేసింది"?

22-12-2025 06:53:12 PM

నాడు కళ కళ.. నేడు వెల వెల..

- ఇదీ సింగరేణి యాజమాన్యం తీరు

- సింగరేణి డే కు ఎగనామం 

- అనూహ్యంగా మారిన నిర్ణయం 

- కలవరపెడుతున్న కంపెనీ తీరు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి ఆవిర్భావ వేడుకలకు సింగరేణి మొండి చెయ్యి చూపనున్న దా..అంటే అవుననే సమాధానమే వస్తున్నది. సింగరేణిఆవిర్భవించి 130 ఏళ్లయింది. ఏటా నిర్ణయించే ఆవిర్భావ వేడుకలకు ఈ సారి యాజమాన్యం మంగళం పాడింది. నిధుల కొరత పేరుతో  సింగరేణి 130 ఏళ్ల చారిత్రక ఉత్సవాలకి ఎగనామం పెట్టింది. ఎప్పుడు ఎప్పుడాని ఎదురుచూస్తున్న కార్మిక లోకానికి ఉత్సవాలకు కొర్రి పెడుతూ, తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.

ప్రతీ యేటా డిసెంబర్ 23 న సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో అబ్బురపరిచే రీతిలో సింగరేణి వేడుకలు కన్నుల పండువగా జరుపుతారు. పడి రోజుల క్రితమే ఫుట్బాల్ క్రీడాకారుడు మిస్సి ఆట కోసం రూ. 10 కోట్లు కేటాయించిన సింగరేణికి సింగరేణి వేడుకలకు నిధుల కొరత సాకుతో వేడుకలకు నిధులు లేవనడాన్ని కార్మిక సంఘాలు, కార్మికులు తావు పడుతున్నారు.గతం లో సింగరేణి ఆవిర్భావ  ఉత్సవాలకు ప్రతి ఏరియాకు రూ. మూడున్నర లక్షల బడ్జెట్ ను  కేటాయించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేది.

ఈసారి ప్రతి ఏరియాకు రూ.60 వేలు మాత్రమే కేటాయించింది. అదికూడా జీఎం ఆఫీస్ కేంద్రంలో పతాకవిష్కరణ కోసమే ఈ నిధులను కేటాయించింది. సింగరేణి వేడుకల నిర్వహణ విషయంలో సింగరేణి యాజమాన్యం అనూహ్యమైన  మార్పు సింగరేణి కార్మిక లోకాన్ని ఒక్కసారిగా షాక్ గురిచేసింది. మొక్కుబడిగా వేడుకలకు పరిమితం కావడంపట్ల సింగరేణిలో నిప్పులు చెరుగుతున్నారు. కేవలం జెండా ఆవిష్కరణలతో నే వేడుకలు సరిపెట్టుకునే మొక్కుబడిగా తంతుగా కార్యక్రమo ముగించడం  పట్ల విమర్శలు పెల్లుబికుతున్నాయి.

మిస్సి ఆట పండుగ.. సింగరేణి వేడుక దండగ..

ఫుట్బాల్ క్రీడాకారుడు మీస్సి ఆట సింగరేణికి పండుగగా మారింది. అదే సింగరేణి 130 యేళ్ల ఉత్సవ వేడుకలు దండుగగా మారిపోయాయి. ఇలా సింగరేణి ఆవిర్భావ ఉత్సవాల విషయంలో యజమాన్యం యూటర్న్ తీసుకోవడం పై సింగరేణిలో వేడి వాడి చర్చ జరుగుతుంది. యావత్ కార్మిక లోకం, ఉద్యోగులు కార్మిక సంఘాలు సైతం యజమాన్యం నిర్ణయంతో ఖoగుతింటున్నారు. సింగరేణి ఉత్సవాలక కంటే మిస్సీ ఆటనే కంపెనీకి  ముఖ్యమైందా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగరేణి యాజమాన్యం తిరోగమన ధోరణి మరెన్ని కోటలకు, వాతలకు దారితీస్తోందనే ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతున్నది. భవిష్యత్తులో సింగరేణి యజమాన్యం వ్యవహారం అంత సాదాసీదాగ భావించే పరిస్థితి కనిపిoచడంలేదు. సింగరేణి మనుగడపై ప్రమాద పొంచివున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. సింగరేణి వేడుకల్ని నిర్వహించాలి కార్మికులు, కార్మికసాంఘాలేవి కోరలేదు. సింగరేణి కంపెనీ నే సింగరేణి వేడుకల్ని చేపట్టించి లక్షల నిధులు ఖర్చు చేసింది. కంపెనీ నిర్ణయాన్ని యావత్తు కార్మిక్ లోకం ఆమోదించింది.

తల్లిలాంటి సింగరేణి ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం సముచితమని అందరూ యాజమాన్యం నిర్ణయాన్ని అభినందించారు. ఈ అనవాయితీ సహేతుకమైందని భావించారు. సింగరేణి వేడుకలు జరుపుకోవడంటే మన శ్రామిక చరిత్రనూ ప్రపంచానికి చెప్పడమే అని ఆధ్యంతం సంబరపడిపోయారు. అలాంటిది  సంబరాలను ఒక్కసారిగా నిలిపివేయడం సమంజసం కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వేడుకలపై కార్మిక సంఘాలు ఉదాసీనత..

సింగరేణి కార్మికుల కు పండుగ లాంటి సింగరేణి వేడుకల్ని కంపెనీ నిలిపివేయడం పై కార్మిక సంఘాల రావాల్సిన స్పందన లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదో మొక్కుబడిగా మాట్లాడుతున్నారు. కంపెనీ తీరును సూటిగా వ్యతిరేకించడం లేదు. ప్రధాన సంఘాల నేతల్లో  కొందరూ వేడుకల వల్ల దుబారా ఖర్చులా గా మాట్లాడుతూ పరోక్షంగా కంపెనీ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు ఇప్పటి వరకు జరిగిన సింగరేణి వేడుకల నిర్వహణ తో దుబారా ఖర్చు జరగలేదా ? అని కార్మిక సంఘాల నేతల్ని కర్మకులు ప్రశ్నిస్తున్నారు. వేడుకల పై కంపెనీ నిర్ణయాన్ని ఖర్చులతో ముడిపెట్టి చూడకూడదు.

దాని వెనుక కంపెనీ కుట్ర ను ఖండించాలి. మిస్సి ఆట కోసం రూ. 10 కోట్లు కేటాయిస్తే ఏ కార్మిక సంఘం నాయకుడు ఖండించలేదు. అది దుబారా అని ఎవరూ అనలేదు. కార్మిక సంఘాల్లో సమర్ధవంతమైన పనితీరు లోపం ఇలాంటి పరిస్థితులకి ప్రధాన కారణంగా పలువురు భావిస్తున్నారు. సింగరేణి వేడుకల్ని నిర్వహణ పై కంపెనీ నిర్ణయo గుర్తింపు, ప్రతినిధ్య సంఘాల నేతలకు తేలిక జరిగిదేమి కాదని విమర్శలు ఉన్నాయి. ప్రధాన కార్మిక సంఘాలకు చెప్పకుండా యాజమాన్యం ఏపని చేయదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కార్మిక సంఘాల నుంచి పేలవంగా వస్తోన్న స్పందనలు అనుమానాలను స్పష్టం చేస్తున్నాయి.