22-12-2025 06:49:11 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని 25 గ్రామాలలో నూతన గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లు ప్రమాణం స్వీకారం చేశారు. గ్రామాలలో సర్పంచులు ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా గ్రామాలు అన్ని సందడిగా ఏర్పడ్డాయి. ముందుగా నాయకులు గ్రామస్తులతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం శాలువలతో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు శాలువలతో సత్కరించుకున్నారు.
సుమారు రెండు సంవత్సరాల అనంతరం పల్లెలకు ప్రత్యేక అధికారుల పాలనతో విముక్తి లభించింది. గత సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ సర్పంచులు వార్డు మెంబర్ల పదవి కాలం ముగిసింది. దీనితో ఎన్నికలు జరిగే వరకు గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రవేశపెట్టింది. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కొత్త పాలనకు పంచాయతీలు ముస్తాబయ్యాయి. మండల అధికారులు సర్పంచులతో ప్రమాణస్వీకారం చేయించారు.కొత్త గ్రామపంచాయతీ కొలువుతీరిన అనంతరం ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరవేరాల చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.
గ్రామాలను అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు.పలుచోట్ల కొత్త సర్పంచులు సొంత ఖర్చులతో జిపి భవనాలకు రంగులు ఏమైనా మరమ్మత్తులు ఉంటే చేయించారు.రెండు సంవత్సరాల నిరీక్షణకు తేరపడింది.గత రెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు అవుతున్న పాలకవర్గం గ్రామాలలో విద్య, వైద్యం,తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, కాలువలు, వ్యవసాయ బావులు, చెరువుల అభివృద్ధి లాంటి మౌలిక సదుపాయాల అంశాలపై దృష్టి సాధించవలసి ఉంది. అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే ఉన్నారు.
పాలన అనుభవం, రాజకీయాము నేపథ్యం లేనివారే ఎక్కువ మరోవైపు ఎన్నికల ప్రచారంలో గ్రామాలకు అభివృద్ధి చేస్తామని అన్ని సమస్యలు పరిష్రావిస్తామని అనేక హామీలు ఇచ్చారు.ప్రస్తుతం ఏ గ్రామంలో చూసిన ఎక్కడ అక్కడే సమస్యలు పేరుకుపోయాయి వారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన చేస్తారని మండల ప్రజలు నమ్ముతున్నారు.ఈ క్రమంలో వారికి పల్లెలపాలన సవాలుగా మారాయి. ప్రమాణ స్వీకారాలు అనంతరం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తీర్మానాలు ఆమోదించుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లు,ప్రత్యేక అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.