03-11-2025 03:24:10 AM
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 02 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ పాత బస్టాండ్ మైసమ్మదేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది.తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించగా, భక్తులు అమ్మవారి దర్శనం తీసుకుని, అలంకరణలు, పూల హారాలు, నైవేద్యాలు, వివిధ కానుకలను సమర్పించారు.ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా విశిష్టంగా జరిగింది.
భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు. దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.మైసమ్మ తల్లి కృపతో సిరిసిల్ల పట్టణం ఎల్లప్పుడూ శాంతి, సమృద్ధి, సౌభాగ్యాలతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. మైసమ్మ అమ్మవారి వార్షికోత్సవం కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, ప్రతి భక్తుని హృదయంలో ఉన్న భక్తి, సేవాభావం మరియు సామాజిక బాధ్యతలు ఒకే వేదికపై కలిసే పవిత్ర సమయం. ఇలాంటి కార్యక్రమాలు మన పూర్వీకులు పోషించిన సంస్కృతి, సంప్రదాయాల్ని నేటి తరం హృదయాలలో నాటుతాయి.
ప్రత్యేకించి అన్నదాన కార్యక్రమం వంటి సేవా కార్యక్రమాలు ‘మానవ సేవే మాధవ సేవ’ అనే భావాన్ని మరింత బలపరుస్తాయి. ఇందులో పాల్గొన్న ప్రతిఒక్కరి సేవాభావం నిజంగా ప్రశంసనీయం.మన సమాజంలో భక్తి ఉన్న చోట ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. ఈ ఆలయ కార్యక్రమం ఆ రెండు విలువలకు ప్రతీకగా నిలిచింది.
ఈ పుణ్యకార్యాన్ని విజయవంతంగా నిర్వహించిన కృతజ్ఞతలు దేవాలయ కమిటీ సభ్యులకు, సేవాదారులకు, కృతజ్ఞతలు. ఇట్టి కార్యక్రమంలో ఎర్రవెల్లి దేవేందర్ రావు దంపతులు వడ్లకొండ దేవదాస్ వడ్నాల శేఖర్ బాబు వడ్లకొండ వెంకట సాయి వెలిశాల అభినవ్ బుర్ర శ్రీధర్ తదితరులుతదితరులు పాల్గొన్నారు. భక్తులు పాల్గొన్నారు.భక్తజన బృందంమైసమ్మ దేవాలయం, పాత బస్టాండ్, సిరిసిల్ల