calender_icon.png 3 November, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరు బీఆర్‌ఎస్ ఆఫీసుపై దాడి

03-11-2025 02:10:55 AM

ఫర్నిచర్‌ను తగలబెట్టిన కాంగ్రెస్ శ్రేణులు

  1. తెలంగాణ భవన్ స్వాధీనం 
  2. కాంగ్రెస్ కార్యాలయం ‘ఇందిరమ్మ భవన్’గా ఫ్లెక్సీల ఏర్పాటు 
  3. అడ్డుకున్న బీఆర్‌ఎస్ నేతలపై దాడి.. ఉద్రిక్తత
  4. మణుగూరులో 144 సెక్షన్ 
  5. ఓటమి భయంతోనే దాడి
  6. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు

మణుగూరు, నవంబర్ 2 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఆదివారం రాజకీయ వేడి రాజుకుంది. మణుగూరులోని బీఆర్‌ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దాడికి దిగారు. ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరమ్మ భవన్‌గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌పై ప్రజల్లో పెరుతున్న వ్యతిరేకత, బీఆర్‌ఎస్‌పై ఆదర ణను   ఓర్వలేకే దాడికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కార్యాలయంపై దాడికి దిగారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కార్యకర్తలు, నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ గూండాలే దాడి చేశారంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాడుల విషసం స్కృ తిని ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. దీంతో డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులతో పాటు అదనపు బలగాలతో మోహరించారు.

ఆదివారం ఉదయం వివిధ మండలాల నుంచి భారీ సంఖ్యలో మణుగూరుకు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒక్క సారిగా పట్టణంలోని బీఆర్‌ఎస్ కార్యాలయ ంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసంచేసి, జెండాలను చించి, ఫ్లెక్సీలఫై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. జై పాయం, జై రేవంత్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌ను స్వా ధీనం చేసుకుని, పార్టీ జెండాలను ఎగరవేశారు. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు సంఘటన స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు.

దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ భవన్‌లో ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలను బయటికి గెంటి, అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించి, బయటకు పంపించారు. జై పాయం, జై రేవంత్, అంటూ కార్య కర్తల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. తెలంగాణ భవన్‌గా ఉన్న కార్యాలయాన్ని తిరిగి ఇందిరమ్మ కార్యాలయంగా స్వాధీనం చేసుకోవడంతో  కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ కబ్జాకు తెరపడిందని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఆనందాలతో  బాణసంచా మోత లతో సంబురాలు జరుపుకున్నారు.

కాంగ్రెస్ జెండాలను ఎగురవేసి ఇందిరమ్మ భవన్‌గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాడి విషయం తెలుసుకున్న మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలా నికి చేరుకున్నారు. పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కార్యాల యం వద్ద ఉద్రిక్త పరిస్థితిని అడ్డుకునే ప్రయ త్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకొని ఫర్నిచర్ మంటలను అ దుపు చేసింది. 

సుధీర్ఘకాలపు ఆగ్రహం!

ఈ ఘటన వెనుక కాంగ్రెస్ శ్రేణుల సు దీర్ఘ కాలపు ఆగ్రహం ఉన్నదని తెలుస్తున్నది. 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రభుత్వ విప్‌గా పదవి పొం దారు. మణుగూరులో అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసును బీఆర్‌ఎస్ కార్యాలయంగా కాంతారావు మార్చారు. అయితే ఈ స్థలాన్ని కాంగ్రెస్ కార్యకర్త ఒకరు విరాళంగా ఇవ్వగా, కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో భవనాన్ని నిర్మించారు. నిర్మించుకున్న కార్యాల యాన్ని కాంతారావు సొంతం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. చాలా కాలంగా కార్యాలయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పోరా టం చేస్తున్నారు.

అయితే బీఆర్‌ఎస్ అధికారంలో వుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఏమీ చేయలేక పోయారు. ఇప్పుడు తిరిగి పార్టీ అధికారంలోకి రావడంతో కట్టలు తెంచుకున్న ఆవేశంతో కార్యాలయంపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కష్టంతో  నిర్మించుకున్న కార్యాలయాన్ని రేగా కాంతారావు కబ్జా చేశారని, ఎప్పటి నుంచో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆవేశంతో రగిలిపోతున్నారు. సమయం కోసం వేసి చూసిన వారు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తున్నది. 

మణుగూరులో 144 సెక్షన్ 

మణుగూరులో బీఆర్‌ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి నేపథ్యంలో  బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత  వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం జిల్లా కేంద్రం నుంచి స్పెషల్ పార్టీ బలగాలు మణుగూరుకు చేరుకున్నాయి. మరోవైపు శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు పట్టణంలో పూర్తిగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎవరూ కవ్వింపు చర్య లకు పాల్పడవద్దని హెచ్చరించారు. గొడవలు సృష్టించి ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

దాడి పిరికిపంద చర్య: రేగా కాంతారావు

ముణుగూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి పిరికిపంద చర్య అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. తెలంగాణ భవన్‌పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండి స్తున్నట్లు  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉన్నదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మంత్రుల ప్రోద్భలంతోనే కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక, ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్ కి దుకాన్ ఒక బూటకమని తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన యువజన విభాగాన్ని గూండాల విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెపుతారని పేర్కొన్నారు. జిల్లాకు రావలసిన నిధుల అన్యాయంపై ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీకి లభిస్తున్న ప్రజల మద్దతును జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు..

జిల్లా మంత్రులు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేరేపణతో దాడి చేశారని ఆరోపించారు. భౌతిక దాడులకు భయ పడేది లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు సమన్వయం పాటిం చాలని, భవిష్యత్ తమదేనని చెప్పారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.