4 May, 2026 | 4:42 AM

ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు స్థల పరిశీలన

18-09-2025 12:28 AM

తలకొండపల్లి, సెప్టెంబర్ 17: తలకొండపల్లి మండలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుదవారం అదికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాఠశాల నిర్మాణ నమూన వివరాలను అదికారులను అడిగి తెలుసుకున్నారు. అదికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఈ పాఠశాల నిర్మాణానికి నిదులు కేటాయించిందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి చెప్పారు. మాజీ ఎంపిటిసి దాసరి యాదయ్య,మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు,అదికారులు పాల్గొన్నారు.