18-09-2025 12:30:04 AM
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, సెప్టెంబర్ 17: రక్తదానం ప్రాణదానంతో సమానమని చేవెళ్ల ఎంపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 75వ జన్మదినం సందర్భంగా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ , చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని కేజీఆర్ ఫంక్షన్ హాల్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి హాజరైన ఆయన మాట్లాడుతూ..
రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోడీ జీవితం అందరికీ ఆదర్శమని.. యువత సేవా స్పూర్తిని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్ గౌడ్, సీనియర్ నేత కంజర్ల ప్రకాష్, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి అత్తపురం శ్రీనివాస్ గౌడ్ , చేవెళ్ల మున్సిపల్ ,
మండల అధ్యక్షులు అనంత్ రెడ్డి , శ్రీకాంత్ , మొయినాబాద్ మండల అధ్యక్షుడు దారెడ్డి చంద్రారెడ్డి, నాయకులు వైభవ్ రెడ్డి, గున్నాల గోపాల్ రెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఓబీసీ జిల్లా కన్వీనర్ ఎల్లని వెంకటేష్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి , ఆంజనేయులు గౌడ్ , పత్తి సత్యనారాయణ, మొర నర్సింహ రెడ్డి , కుంచం శ్రీనివాస్ , వెంకట్ రెడ్డి , శర్వలింగం , మాణిక్య రెడ్డి ఇంద్రసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.