18-09-2025 12:28:01 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రులు అనుబంధంగా విశేష వైద్య సేవలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు హెల్త్‌హబ్ బ్రాండ్‌గా ఉస్మానియా డాక్టర్లు గుర్తింపు తీసుకొచ్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధ ఆస్పత్రులైన నీలోఫర్ హాస్పిటల్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్, టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్, పెట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్‌టీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్‌లో వైద్య సేవల బలోపేతానికి చర్యలు చేపట్టాలని మం త్రి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా ఆస్పత్రులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వ హించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆస్పత్రిలో వైద్య సేవల బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆస్పత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో తక్షణమే పర్యటించి వచ్చే రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని టీజీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, ఎక్విప్ మెంట్లు రిపేర్లు , రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి సమీక్షలో హెల్త్ సెక్రటరీ డా క్రిస్టినా, డీఎంఈ డా. నరేంద్ర కుమార్ , ఉస్మానియా అనుబంధ మెడికల్ కాలేజీల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.