26-07-2025 10:47:21 PM
బీజీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి..
నిర్మల్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలనకు ప్రతి కార్యకర్త నాయకుడు చేసిన కృషి ఫలితమేనని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి(BJP leader Maheshwar Reddy) అన్నారు. శనివారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డివిజన్ స్థాయి ప్రజా ప్రతిదుల శిక్షణ సమావేశానికి ఎంపీ నాగేష్(MP Nagesh)తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ పార్టీలో పనిచేస్తున్న నేతలు కార్యకర్తలు క్రమశిక్షణకు పెట్టింది పేరని పార్టీ నిర్మాణంలో వారి కృషి అమోఘమని తెలిపారు. పనిచేసే నేతలకు తప్పకుండా పార్టీలో గౌరవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్,ముధోల్ ఎంఎల్ఏ రామ రావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరయ్యారు నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల,కామారెడ్డి, మంచిర్యాల,కొమురం భీం, అదిలాబాద్ జిల్లాల డివిజన్ మరియు మండల అధ్యక్షుల ప్రశిక్షణ శిబిరం నిర్వహించగా పార్టీ ప్రణాళిక పై చర్చించారు శనివారం నిర్మల్ లోని దివ్య గార్డెన్ లో హట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.