20-08-2025 05:55:05 PM
హైదరాబాద్: కర్నూలు జిల్లా(Kurnool District)లోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. మృతిచెందిన చిన్నారులంతా ఐదో తరగతి విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థులు నీటికుంటలో స్నానానికి దిగడంతో ఈ ఘటన జరిగింది.