16-11-2025 12:00:00 AM
-నిందితుల్లో ముగ్గురు వైద్యులు, ఇద్దరు ఎరువులు, విత్తనాల వికేత్రలు
-అరెస్టయిన వారిలో డాక్టర్ రయీస్ అహ్మద్ భట్‌కు సూత్రధారి ఉమర్ నబీతో సంబంధాలు
-డాక్టర్ రయీస్ అహ్మద్ భట్‌ను లోతుగా విచారిస్తున్న కేంద్ర సంస్థలు
-ఉగ్రవాద మాడ్యూల్లో పాల్గొన్న నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్లు రద్దు
చండీగఢ్: ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసును ఛేదించేందుకు కేంద్ర నిఘా సంస్థలు ము మ్మరంగా శ్రమిస్తున్నాయి. పేలుడు ఘటనలో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ లపై పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ఒక డాక్టర్‌తో పాటు నుహ్కుకు చెందిన మరో ఇద్దరు వైద్యులు, హరియాణాలోని సోహ్నోకు చెందిన ఇద్దరు ఎరువులు, విత్తనాల విక్రేతలను శనివారం అరెస్ట్ చేశారు.
కేంద్ర నిఘా సంస్థలు అదుపులోకి తీసుకున్న పఠాన్‌కోట్‌లోని వైట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ రయీస్ అహ్మద్ భట్(45)కు ఎర్రకోట పేలుడు సూత్రధారి డాక్టర్ ఉమర్ నబీతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. డాక్టర్ రయీస్ అహ్మద్ భట్ 2020 నుంచి 2021 వరకు అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు.
డాక్టర్ భట్ విశ్వవిద్యా లయ సిబ్బందితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాడని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. వాస్తవాలను నిర్ధారించడానికి, జైష్-ఎ-మొహమ్మద్, అన్సా ర్ ఘజ్వత్-ఉల్-హింద్ మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘వైట్ కాలర్‘ టెర్రర్ మాడ్యూల్లో అతను భాగమా అని నిర్ధారించడానికి భట్ను అదుపులోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ‘నిందితులలో ఒకరు అతనికి ఫోన్ కాల్ చేశారు‘ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారు.
అల్-ఫలాహ్ వర్సిటీపై అధికారుల నిఘా
ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంపై కేంద్ర,రాష్ట్ర సంస్థల అధికారులు నిఘా పెట్టారు. రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయం భూమి రికార్డులు, కొలతలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 10న ఎర్రకోటలో జరిగిన పేలుడు వెనుక ఉగ్రవాద మాడ్యూల్లో పాల్గొన్న నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్లను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) రద్దు చేసింది.
నబీ మూడు గంటల పాటు ఏం చేశాడు?
బాంబుల తయారీలో ఎర్రకోట బాం బు పేలుడు ఘటన సూత్రధారి డాక్టర్ ఉమర్ నబీ నిపుణుడని కేంద్ర నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. ఎర్రకోట పేలుడుతో రెండు కిలోల నైట్రేట్ వాడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తిం చాయి. ఇప్పటి వరకు లభించిన 52కు పైగా పేలుడు పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, ఇతర పదా ర్థాలతో నబీ పేలుడు పదార్థాలను తయా రు చేసి ఉండొచ్చని భావిస్తున్నాయి. అలా ంటి బాంబులను 5 నుంచి 10 నిమిషాల్లోనే తయారు చేయొచ్చని ఫోరెన్సిక్ వర్గాలు వెల్లడించాయి.
ఎర్రకోట సమీప ంలో పేలుడు జరగడానికి ముందు దగ్గరలోని పార్కింగ్ ప్రాంతం వద్ద నబీ మూ డు గంటలపాటు ఎందుకు వేచి ఉన్నాడో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేలు డు జరిగిన రోజు నబీ కారు మధ్యాహ్నం 3.19గంటల సమయంలో పార్కింగ్ ప్రాంతంలోకి ప్రవేశించిందని సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. సాయంత్రం 6.28గంటల నిమిషాలకు అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో పేలుగు సంభించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
డాక్టర్ నిసార్ హసన్ ఎవరు?
శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్ ఆస్పత్రి మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ నిసార్ ఉల్ హసన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఫరీదాబాద్ ఉగ్రవాద కుట్ర, ఎర్రకోట పేలుడు కేసుతో ముడిపడి ఉన్న అంతర్‌రాష్ట్ర వైట్‌కాలర్ జైష్‌ఎ అహ్మద్ మాడ్యూ ల్ దర్యాప్తులో నిసార్ ఉల్ హసన్ పేరు భయటపడడం చర్చనీయాంశంగా మారిం ది. జాతీ వ్యతిరేక ఆధారాల కారణంగా జమ్మూకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ పరిపాలన ద్వారా ఆర్టికల్ 311(2)(సి) ప్రకారం 2023 నవంబర్‌లో అతడిని ప్రభుత్వ వైద్య సేవల నుంచి తొలగించారు.
తప్పుడు చిరునామాతో సిమ్‌కార్డ్
గత వారం ఫరీదాబాద్‌లో అరెస్ట్ అయిన డాక్టర్ షాహిన్ షాహిద్ తప్పుడు చిరునామాతో సిమ్ కార్డు పొందినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. అల్-ఫలాహ్ వర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్లో ఉంటున్న డాక్టర్ షాహీన్‌కు జైష్-ఎ-మొహ్మద్ ‘వైట్-కాలర్‘ టెర్రర్ మాడ్యూల్‌తో సంబం ధాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. షాహిన్ హరియాణాలోని ఓ మసీదు చిరునామాను ఉపయోగించి సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.