7 August, 2026 | 2:30 AM

అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి

07-08-2026 12:00 AM

ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

అబ్దుల్లాపూర్ మెట్, ఆగస్టు6(విజయక్రాంతి): మండలంలోని కుంట్లూరు పల్లవి ఇంజినీరింగ్ కాలేజీ (అటానమస్)లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను నూతనంగా ప్రవేశం పొందిన బీటెక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం గురువారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లవి విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య మాట్లా డుతూ ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థు లు తమ జ్ఞానాన్ని, సాంకేతిక నైపుణ్యాలనుపెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యార్థులనుబాధ్యతాయుతమైన ఇంజినీర్లుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయ డమే తమ సంస్థల లక్ష్యమని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో పల్లవి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మల్క నవీన్ కుమార్, సత్యం కంప్యూటర్స్ మాజీ తాత్కాలిక సీ ఈవో ఏ.ఎస్.మూర్తి, ప్రిన్సిపాల్ రాజు, అకడమిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎస్.జి.ఎస్. మూర్తి, డైరెక్టర్ డాక్టర్ జె.బి.వి. సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. ప్రశాంత్ కుమార్, మేనేజ్మెంట్ ప్రతినిధి బేరెల్లి కమలాకర్ రావు, ఇతర అధ్యాపక బృందం, నూతన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.