calender_icon.png 25 January, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న సినిమాలను ఆదరించాలి

25-01-2026 12:03:54 AM

పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్

ఎల్బీనగర్, జనవరి 24 : తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాలకు అండగా ఉంటుందని, ప్రేక్షకులు చిన్న నటుల సినిమాలను ఆదరించాలని పీసీసీ ప్రచార కమి టీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కోరారు. తెలంగాణ నటుడు గుడుగుంట్ల మహేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సార్ జాంబీ‘ చిత్రం టీజర్‌ను శనివారం కొత్త పేట లో ప్రారంభించారు. ‘సార్ జాంబీ‘ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధు యాష్కీగౌడ్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చిన్న సినిమాలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సార్ జాంబీ సినిమా హీరో మహేష్, కాంగ్రెస్ నాయకులు బొగ్గారపు వరుణ్, మొగులపల్లి ఉపేందర్, శరత్ తదితరులు పాల్గొన్నారు.