25-01-2026 12:02:36 AM
రామగుండం, జనవరి 24 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ ఎదుట శనివారం 8 మంది మావోయిస్టులు లొంగిపో యారు. చత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీలో పనిచేసే వారున్నారు.
మావోయిస్టు ముఖ్య నేత శ్రీకాంత్‌తోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు లొంగిపోగా, అందులో ఒకరు మహిళ ఉన్నారు. మావోయిస్టులు గన్నుదించి, రా జ్యాంగాన్ని ఎత్తుకోవాలని, మావోయిస్టులు ఆయుధాలను, అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అం దుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ నుంచి అచ్చంపేటకు శనివారం ఉద యం 11:30 గంటల సమయంలో కారులో వస్తున్న ఐదుగురు మావోయిస్టులను అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వరంలోని బృందం అదుపులోకి తీసుకున్నది. అందులో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు మీసాల సాల్మన్, ఆయన భార్య సంబత్తితోపాటు సా నుభూతి పరులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ మీడియాకు వెల్లడించారు.
వీరంతా తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భద్రతా దళాలపై పలు నేరాలకు పాల్పడ్డారు. పట్టుబడ్డ వారిలో ఏపీలోని పల్నాడు గుంటూ రు జిల్లా బొల్లపల్లి మండలం మామిడిపాడు గ్రామానికి చెందిన సంతోష్ అలియాస్ నాగరాజ్(52), మీసాల సలోమన్ భార్య ఓయ మ్ సంబత్తి(40), నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఎడ్ల అంబయ్య(46), అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామం జక్కా బాలయ్య(60), లింగాల మండలం క్యాంపు రాయవరానికి చెందిన మాన్ శెట్టి యాదయ్య(50) ఉన్నారు.
వారి నుంచి కారు, రూ.1,25,000, పది రౌండ్ల ఏకే-47, పది రౌండ్ల ఇన్సాస్, ఒక రేడియో, 5 జెలటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఓయ మ్ సంబత్తి(40) తలపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఈ మె చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్గులంక గ్రామం.