calender_icon.png 9 January, 2026 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంఘిక సంక్షేమ అవగాహనతోనే సమాజ మార్పు

03-01-2026 10:09:52 PM

 క్షేత్ర పర్యటనలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీజీ విద్యార్థులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సోషల్ వర్క్ విద్యార్థులు శనివారం పట్టణంలోని పలు స్వచ్ఛంద సేవా సంస్థలను సందర్శించారు. సామాజిక అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడంలో భాగంగా ఈ క్షేత్ర పర్యటనను నిర్వహించారు. పట్టణంలోని 'సాధన' స్వచ్ఛంద సంస్థను సందర్శించి, అక్కడి జిల్లా అధికారిని గిరిజ, బాల్య వివాహాల దుష్ప్రభావాలను,బాలల హక్కులను, గిరిజన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థులు ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమం ఇన్చార్జి నబి విద్యార్థులకు అక్కడి వసతులను చూపిస్తూ వృద్ధుల సంరక్షణ పద్ధతులను వివరించారు. సమాజంలో వృద్ధుల పట్ల యువత బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. ఈ పర్యటనలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ జి.రమేష్, డాక్టర్ పిబి సత్యం పీజీ సోషల్ వర్క్ విద్యార్థులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.