calender_icon.png 9 January, 2026 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి చర్యలు

03-01-2026 10:12:19 PM

- ఎంపీ వంశీకృష్ణ

జైపూర్, (విజయక్రాంతి): భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి సందర్శించి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గట్టు మల్లన్న స్వామి ఆలయ అభివృద్ధికి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు.

మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్లు, ఆలయ ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, ఈ క్రమంలో రహదారి ఏర్పాటుకు అవసరమైన అటవీ శాఖ అనుమతుల ప్రక్రియ త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎంపీ లాడ్స్ కింద నిధులు కేటాయించి ఆలయ పరిధిలో అభివృద్ధి చర్యలు చేపడతామన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉప తహసిల్దార్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.