03-01-2026 10:07:44 PM
ఖమ్మం టౌన్,(విజయ క్రాంతి): స్థానిక వన్ టౌన్ ఏరియా ముస్తఫా నగర్ గుర్రాల బొమ్మ సెంటర్ నందు 1 వ పట్టణ అధ్యక్షులు గడిల నరేష్ వారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ఒకటవ పట్టణ కార్యాలయం శనివారం ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరావు, బిజెపి తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు,నల్గొండ జిల్లా ఇన్చార్జి సన్నే ఉదయ్ ప్రతాప్, 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ ప్రముఖ వైద్యులు డాక్టర్ శీలం పాపారావు గోంగూర వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాబోవు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ దృష్ట్యా ఖమ్మం అసెంబ్లీ నందు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా బూతు స్థాయి లెవెల్ నుండి కార్యక్రమములు చేపట్టే ముఖ్య ఉద్దేశంతోనే వన్ టౌన్ మండల కేంద్రంలో బీజేపీ వన్ టౌన్ కార్యాలయం ను ఏర్పాటు చేయటం జరిగిందని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమం లొ జిల్లా నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు,నల్లగట్టు ప్రవీణ్ వీరవెల్లి రాజేష్ గుప్తా,రజిని రెడ్డి సుదర్శన్ మిశ్రా,కందుల శ్రీకృష్ణ, నక్క రవి, బండ్ల రిగాన్, తుమ్మ శివ,వక్కలంక సుబ్రహ్మణ్యం మందడపు సుబ్బారావు, పాలేపు రాము, పొట్టిమూతి జనార్ధన్, మందడపు ప్రభాకర్ రెడ్డి, మేకల నాగేందర్,శేషాద్రి శిరోమణి కొల్లిపాక శ్రీదేవి,దొడ్డ అరుణ, మండల నాయకులు పొట్టిమూతి వాణి,బొడ్ల శ్రీనివాస్, నాగవెల్లి రామచంద్రం, కడదుల ప్రభాకర్, తుమ్మ ఇందు, బాలి బిందు, దార్ల మల్లీశ్వరి, వాకదాని రామకృష్ణ,గుత్తా వంశీ, మరియు జిల్లా, 2,3, అర్బన్ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.