calender_icon.png 23 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్’!

23-01-2026 01:18:10 AM

పరిశీలిస్తున్నామన్న మంత్రి నారా లోకేశ్

అమరావతి, జనవరి 22: రాష్ట్రంలో సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించాలన్న అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఏపీలో పెట్టుబ డుల కోసం దావోస్‌లో ఉన్న మంత్రి లోకేశ్  సోషల్ మీడియా బ్యాన్ అంశంపై స్పందించారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం డిసెంబర్ నుంచి నిషేధం విధించింది.

పిల్లలు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అనర్థాలు తె చ్చుకుంటున్నారు. దీనిని గమనించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని బ్యాన్ చేసింది. రాష్ట్రం లో ఈ అంశాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.