calender_icon.png 27 July, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సామూహిక కుంకుమ పూజలు

26-07-2025 12:40:01 AM

కరీంనగర్ క్రైం, జూలై25(వికాయక్రాంతి):కరీంనగర్ పట్టణం చైతన్యపురి లోని మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. శ్రావణమాసం మొదటి శుక్రవా రం నేపథ్యంలో దేవాలయానికి అశేష సం ఖ్యలో మహిళలు తరలివచ్చి  అమ్మవార్లను దర్శించుకుని సామూహిక కుంకుమ పూజలోపాల్గొన్నారు.