calender_icon.png 27 July, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంచి కొడుతున్న వానలు

26-07-2025 12:36:58 AM

  1. నిండుకున్న జలాశయాలు 

క్రమంగా పెరుగుతున్న గోదావరి 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 25, (విజయ క్రాంతి) ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వి స్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నా లుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాలేరు, వైరా, కిన్నెరసాని, తాళి పేరు జలాశయాల్లో కి వరద నీరు వచ్చి చేరుతోం ది. వైరా జలాశయం పూర్తిస్థాయికి మించి ప్రవహిస్తుంది, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 22 అడుగులకు చేరుకుంది. సిం గభూపాలెం చెరువు అలుగు పారుతుంది.

ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహించటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జ లాశయం నుంచి 2 గేట్లుఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని బయటికి పంపనున్నట్లు జన్కో అధికారులు ప్రకటించారు.

జలాశయం పూ ర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుత జలాశయం నీటిమట్టం 404 అడుగులకు చేరుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పొం గి ప్రవహిస్తున్న వాగుల వద్దకు కొంతమంది యువత చేపల వేటకు వెళుతున్నారు.

ఏజెన్సీ అతలాకుతలం 

చర్ల, జులై 25 (విజయక్రాంతి) జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల కారణంగా ఈ ఏజెన్సీ ప్రాం తం అతలాకుతలమైంది.  మారుమూల గిరిజన మండలమైన చర్లలో వాగులు వంకలు పొంగి పొరలు తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా చర్ల వెంకటాపురం ప్రధా న రహదారి ఏనక గూడెం వద్ద వంతెన కుంగిపోయిన విషయం విధితమే.

వంతెన నిర్మాణం సమయంలో తాత్కాలికగా ఏర్పాటుచేసిన రహదారి భారీ వర్షాల కారణంగా బురద మయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఆర్టీసీ బస్సులు పూ ర్తిగా నిలిపివేశారు దేంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మండ ల పరిధిలోని తాలుపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఏడు గేట్లు ఎత్తి 24,905 క్యూసెక్కుల నీటిని గోదావరికి విడుదల చేశారు.

ఎగో భాగమైన చతిస్గడ్ తో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద పోటెత్తింది. తాళి పేరుతో పాటు చింతవాగు పడిగ వాగు రో టెంత వాగు రాళ్లవాగు ఉదృతంగా ప్రవహించడంతో జలాశయానికి ఒక్కసారిగా 22,992 క్యూసెక్కుల నీరు కొత్తగా వచ్చి చేరుతుంది. దీంతో ఏజెన్సీ అటవీ ప్రాంతాల ప్రజలు బిక్కుబెక్కుమంటూ జీవనాన్ని వెలదీస్తున్నారు.