calender_icon.png 8 August, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ సంఘీభావ ర్యాలీ

08-08-2025 12:25:14 AM

ఖమ్మం, ఆగస్ట్ 7 (విజయ క్రాంతి): పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపు మేరకు ఖమ్మం పట్టణంలో ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న జాతి హనన చర్యలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ వేలాది మందితో ఖమ్మం లో గురువారం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల విద్యార్థులు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొనగా సిపిఐ, సిపిఎం, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనలో అగ్రభాగాన నడిచారు.

వివిధ మైనా రిటీ సంస్థలకు చెందిన మహిళలు, యువకులు జాతీయ జెండాలు, పాలస్తీనా జెండా లతో సంఘీభావం ప్రదర్శిస్తూ సేవ్ గాజా అనే నినాదంతో హెూరెత్తించారు. వివిధ ప్రజాసంఘాలు, విద్యార్ధి, యువజన సం ఘాలు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ర్యాలీలో నడిచారు. మార్చ్ ఫర్ హ్యూమానిటీ పేరుతో గాజాలో పాలస్తీనా జాతి హననానికి ఇజ్రాయెల్ చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు.

నెతన్యాహుని యునైటెడ్ నేషన్స్ యుద్ధ నేరస్తునిగా ప్రకటించిందనీ, ఇజ్రాయెల్ సైన్యాలు గాజాలో మానవతా సాయాన్ని కూడా అందకుండా చేస్తుందనీ, ఆహార పదార్థాలు, మందులు అందకుండా చేసి ఆకలి చావులకు గురిచేస్తుందనీ వివరించారు. ఆసుప త్రులు, స్కూళ్ళు నివాస స్థలాలపై బాంబులు కురిపించి వందలాది మంది డాక్టర్లను, వేలాది మంది పసిపిల్లలను చంపిన ఇజ్రాయెల్ చర్యలను ర్యాలీలో ఖండించారు.

తక్షణమే యుద్ధాన్ని ఆపివేయాలనీ, గాజా లో ఆహార పదార్థాలు, మందులు, మానవతా సాయాన్ని పునరుద్ధరించాలనీ ఈ ప్రదర్శన డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమం లో వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు, డాక్టర్లు విద్యార్థులు పాల్గొన్నారు.