calender_icon.png 19 May, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సింధూర్‌కు సంఘీభావ ర్యాలీ

19-05-2025 12:17:35 AM

ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ 

మహబూబ్ నగర్ మే 18 (విజయ క్రాంతి) : ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా జిల్లా కేంద్రంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ఎత్తున మనం సైతం దేశం కోసం సైనికులకు వందనం అంటూ స్థిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికులు అలుపెరగకుండా నిగా కాస్తున్నారని తెలిపారు.

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దేశ భద్రత విషయంలో రాజీ లేకుండా రాత్రి పగలు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులకు అందరం మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పట్టణవాసులు పాల్గొన్నారు.

అంతకుముందు హైదరాబాదులోని గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను తెలిపారు. ప్రభుత్వం వేగంగా గాయపడిన వారికి చర్యలు తీసుకుంటూ ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు.