19-05-2025 12:16:14 AM
-ఇందిరా సౌర గిరిజల వికాసం ప్రారంభించనున్న రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ.12,600 కోట్ల బడ్జెట్‌తో కూడిన ‘ఇంది రా సౌర గిరిజల వికాసం’ పథకాన్ని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం ప్రారంభించనున్నారు.
ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనున్నది. ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సోలార్ పంపుసెట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
అనంతరం సీతారామాంజనే ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభలో మాట్లాడుతారు. కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. కొండారెడ్డిపల్లిలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివెళ్తారు.