calender_icon.png 9 January, 2026 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడ రామ్ విలాస్ సందులో పారిశుద్ధ్య దుస్థితి

06-01-2026 12:39:56 PM

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని(Maripeda town) రామ్ విలాస్ సందు కనకదుర్గ ఫంక్షన్ హాల్ ఎదురు బజారు ప్రాంతంలో పారిశుధ్య పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. మురికి కాలువను సకాలంలో తీయకపోవడంతో లెట్రిన్ వాటర్ నేరుగా కాలువలో కలుస్తూ, అక్కడి నుంచి రోడ్డు మీదికి ప్రవహిస్తోంది. ఫలితంగా రోడ్డంతా దుర్వాసనతో నిండిపోగా, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదే ప్రాంతంలో గత ఆరు రోజులుగా చెత్త తీసుకెళ్లే వాహనం రాకపోవడంతో ఇళ్లలో చెత్త పేరుకుపోయింది. చెత్త నిల్వల వల్ల దోమలు, ఈగలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బజారు ప్రాంతం కావడంతో వ్యాపారస్తులు, వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇంకా రెండు రోజుల వరకు చెత్త వాహనం రాదు, కొంచెం సర్దుకోండి అనే సమాధానం రావడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రజారోగ్యానికి సంబంధించిన కీలక అంశాల్లో కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని స్థానికులు విమర్శిస్తున్నారు. తక్షణమే మురికి కాలువలను శుభ్రం చేయడంతో పాటు, చెత్త వాహనాలను నిత్యం పంపించి పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు, వ్యాపార వర్గాలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజా ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.