16-07-2025 01:18:38 AM
జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 15: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ సినీ నటుడు చిరంజీవి చేసిన దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం నిర్ణ యం తీసుకోవాలంటూ జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇంటి పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రిటెయిన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న జీహెచ్‌ఎంసీకి చేసుకు న్న దరఖాస్తుపై స్పందన లేదంటూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు. 2002లో గ్రౌండ్, మరో రెండంతస్థుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధ రణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు న్యాయవాది వివరించారు. తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలన్న అభ్యర్థనను జీహెచ్‌ఎంసీ పట్టించుకోలేదని చెప్పా రు.
దీనిపై జీహెచ్‌ఎంసీ న్యాయవాది స్పందిస్తూ.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిటిషనర్ దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించి న న్యాయస్థానం విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.