calender_icon.png 16 July, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ

16-07-2025 02:41:03 PM

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir) కేంద్ర పాలిత ప్రాంతానికి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడానికి రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి(PM Narendra Modi) సంయుక్తంగా లేఖ రాశారు. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద చేర్చడానికి ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కూడా వారు అభ్యర్థించారు. గత ఐదు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని నిరంతరం పిలుపునిచ్చారని ఖర్గే, రాహుల్ గాంధీ మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.