16-07-2025 02:51:12 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపెల్లి మండలం(Kothapalli Mandal) మల్కాపూర్ గ్రామంలో జైకిసాన్ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న రైతు సంక్షేమ సంఘ భవనానికి బుధవారం రోజున విశ్రాంత ఉపాధ్యాయులు, రాజరాజేశ్వరి లైన్స్ క్లబ్ అధ్యక్షులు, నరహరి లక్ష్మా రెడ్డి వారి తండ్రి కీర్తిశేషులు నరహరి రామ్ రెడ్డి జ్ఞాపకార్థం 25000 వేల రూపాయలు జై కిసాన్ రైతు సంక్షేమసంఘం అధ్యక్షులు గుంటపల్లి రవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొత్త మహేష్, కోశాధికారి గంగాధర నరేష్ , గౌరవ అధ్యక్షులు గంగాధర లక్ష్మణ్ , మాజీ ఉపసర్పంచ్ కాంతాల జగన్ రెడ్డి, సభ్యులు కొత్త సంపత్, కొత్త కనకయ్య, కొత్త లింగమూర్తి, కొత్త మధు,పల్లాటి ప్రశాంత్, బొలబత్తిని శ్రీనివాస్, పల్లాటి జలంధర్, కుమ్మరి రామస్వామి,పండుగ కృష్ణ కుమార్ మరియు జాడి రాజు పాల్గొన్నారు