16-07-2025 02:43:39 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): భవిష్యత్తు తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ముందుండాలని, అన్ని పోలీసు స్టేషన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రకృతికి అందం మొక్కలేననీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఏ.నరేష్ కుమార్, వర్టికల్ డీఎస్పీ నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.