calender_icon.png 16 July, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కార్మెల్ డే వేడుకలు

16-07-2025 02:55:08 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని కార్మెల్  హై స్కూల్(Carmel Convent High School)లో బుధవారం కార్మెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెవ ఫాధర్ డేనియల్, మదర్ మరియా ఆగస్టిన్ లు హాజరై కేకు కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ వేడుకలలో కర్నూల్ హై స్కూల్ స్టేట్ బోర్డు ప్రిన్సిపాల్ సిస్టర్ సారూప్య, సీబీఎస్ఈ బోర్డు ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్, కాన్వెంట్ సిస్టర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.