16-07-2025 02:53:11 PM
మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)గా భుక్యా చత్రు నాయక్ బుధ వారం బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా ఎఫ్ టి సి లో డిడి గా విధులు నిర్వహించిన చత్రు నాయక్ బదిలీపై మంచిర్యాల జిల్లా డిఏఓగా వచ్చారు. బాధ్యతలు చేపట్టిన చత్రు నాయక్ కు ఏడిఏలు గోపాల్, సురేఖ, వ్యవసాయ శాఖ అధికారులు (టెక్నికల్)లు శ్రీనివాస్, ఫారిహన్, తరుణ్ తదితరులు బొకే అందజేసి స్వాగతం పలికారు.