calender_icon.png 16 July, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీ ఉద్యోగుల జిల్లా జేఏసీ కమిటీ ఎన్నిక

16-07-2025 02:19:13 PM

జేఏసీ చైర్మన్ గా తగరం శివ.

జేఏసీ ప్రధాన కార్యదర్శిగా పెంబర్తి రాజు.

హనుమకొండ, (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ, కారోబార్, బిల్ కలెక్టర్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) హనుమకొండ జిల్లా నూతన కమిటీని, రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో జేఏసీ రాష్ట్ర నేతలు చాతల్ల సదానందం, వంగ రవీందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ తగరం శివ, ప్రధాన కార్యదర్శిగా పెంబర్తి రాజు, కోశాధికారిగా పర్ష భాస్కర్, గౌరవ అధ్యక్షుడిగా అలువాల సుదర్శన్, ఉపాధ్యక్షులుగా మడిపెల్లి కుమారస్వామి, బత్తిని అశోక్ లను  ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా కట్కూరి శ్రీనివాస్, పల్నాటి రమేష్, ప్రచార కార్యదర్శులుగా వడ్డెపల్లి రాంబాబు, శ్రీపతి కిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నీలం కుమార్, మామిండ్ల రమేష్, మీడియా ఇన్చార్జిలుగా యజ్ఞం సురేష్, కుక్కముడి నరేష్, మడూరి శ్యాంకుమార్, గౌరవ సలహదారులుగా కుమ్మరి నగేష్, వెనుకమూరి అనందరావులు ఎన్నికయ్యారు.