calender_icon.png 1 May, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై ధాన్యాన్ని అరబోయకూడదు

24-04-2025 12:39:41 AM

తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ ఐ శ్రీనివాస్

కొండపాక, ఏప్రిల్ 23 : రోడ్లపై  ధాన్యం కుప్పలను అరబోయడంతో వాహనదారులు ప్రమాదాల గురవుతున్నారని తొగుట సిఐ లతీఫ్ అన్నారు. రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల ప్రమా దాలకు కారణం కావద్దని రైతులకు సూచించారు. సాధ్యమైనంత వరకు రోడ్లపై ధాన్యాన్ని పోయకుండా చూడాలని తెలిపారు. రోడ్లపై ధాన్యం పోసి ఇతరుల మరణానికి కారణం కావద్దన్నారు.

రోడ్లపై ధాన్యం  కుప్పలు ఉండడం వల్ల రాత్రిళ్ళు కనబడకుండా వాహనదారులు ప్రమాదాలకు  గురవుతున్నారని రైతులు విషయాన్నీ గమనించి తమ ధాన్యాన్ని  బావి దగ్గర, ఇండ్ల వద్ద,ఇతర ప్రదేశాలలో ధాన్యం అరబోయడానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు.

రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని మోటార్ సైకిల్ వాహనదారులు తగిలి ప్రమాదాలకు గురవుతున్నారాని అన్నారు.