10-12-2025 12:00:00 AM
చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం
కరీంనగర్, డిసెంబరు 9 (విజయ్ క్రాంతి): కరీంనగర్ విప్లవాత్మక చట్టాలతో దేశ అభ్యున్నతికి పాటుపడ్డ మహిళా నేత సోనియా గాంధీ అని చొప్పదండి ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం జాతీయ కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.
ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటుచేసిన భారీ కేక్ ను డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎ మ్మెల్యే డా కవ్వంపల్లి సత్యనారాయణ, కా ర్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అం జన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి న రేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితో కలిసి కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలు మాట్లాడుతూ సోనియా గాంధీ గారు 2004 నుంచి 2014 వరకు యూపీఏ చైర్ పర్సన్ గా ఉండి ఆనాడు ప్రధాన మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎన్నో విప్లవత్మకమైన కార్యక్రమాలు విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 60 సంవ త్సరాల ఆకాంక్ష, ఆనాడు కరీంనగర్ వేదికగా ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం శాశ్వ తం కాదని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు శాశ్వతం అని గౌరవించి తెలంగాణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో కాంగ్రెస్ నేత చక్రధర్ రావు, వీర దేవేందర్ పటేల్ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం వాకర్స్ కు రాగిజావ పంపిణీ చేశారు. మహి ళా నేత వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో మా ర్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కా ర్పొరేటర్ టేల భూమయ్య ఆధ్వర్యంలో కోతి రాంపూర్ గిద్దె పెరుమండ్ల స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్ నేత బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపేరు. కాంగ్రెస్ నేత ఆ ల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.ఎ. మోసిన్ ఆధ్వర్యంలో వృద్దులకు పండ్లు, బ్రె డ్ పంపిణీ చేశారు. నగర కాంగ్రెస్ ఎస్ సి సె ల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో కార్ఖానా గడ్డ గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేశా రు.
మైనారిటీ సెల్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు అహ్మద్ అలీ ఆధ్వర్యంలో కాపువాడ కరీము ల్లా షా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్ర మాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఆధ్వర్యం లో తీగల వంతెన వద్ద షేరెల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపాటు.
ఈ కార్యక్రమాల్లో నా యకులు ఆరేపల్లి మోహన్, కోమటిరెడ్డి ప ద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, మ డుపు మోహన్, పహాడ్, ఆకారపు భాస్కర్ రె డ్డి, వంగల విద్యాసాగర్, గడ్డం విలాస్ రెడ్డి, చర్ల పద్మ, కర్ర రాజశేఖర్, అజీమ్ మహమ్మద్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి, కుర్ర పోచయ్య, వెన్నం రజిత రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మాచర్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, దుబ్బ నీరజ, సలీముద్దీన్, ఇమ్రాన్, గంగుల దిలీప్, మునిగంటి అనిల్, తదితరులుపాల్గొన్నారు.