calender_icon.png 17 December, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయానికి జిరాక్స్ మిషన్ విరాళం

10-12-2025 12:00:00 AM

కొమురవెల్లి, డిసెంబర్ 9: ప్రముఖం పు ణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ కొమురవెల్లి శాఖ వారు జిరాక్స్ మిషను విరాళంగా అందజేశారు. దేవాలయ సిబ్బంది జిరాక్స్ కాపీల కోసం బయటకు వెళ్లి తీసుకురావడం ఇబ్బందిగా మారేది. దీన్ని గమనించిన గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారులు జిరాక్స్ మిషన్ ను దేవాలయ కార్యాలయంలో కార్యనిర్వహణాధికారి టం కశాల వెంకటేష్ కు మంగళవారం అందజేశారు.

95000 విలువగల జిరాక్స్ మిషను దేవాలయానికి అందజేశామని గ్రామీణ వికాస బ్యాంక్ జనరల్ మేనేజర్ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధా న అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ బ్యాంక్ అధికారులు ఉదయ్ కిరణ్, రాజేష్,కిరణ్, పృద్విలు పాల్గొన్నారు.