calender_icon.png 17 December, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవో జిల్లా కార్యదర్శి, ఎస్‌ఈ సంగెం లక్ష్మణరావుకు ఘన సన్మానం

10-12-2025 12:00:00 AM

కరీంనగర్, డిసెంబరు 9 (విజయ క్రాంతి): టీఎన్జీవో జిల్లా కార్యదర్శి, నీటిపారుదారుల శాఖ సూపరిండెంట్ సంగేం లక్ష్మణరావు నీటిపారుదల శాఖ రాష్ట్ర అడ హక్ కమిటీ కన్వీనర్గా నియమితులై పదవిని స్వీకరించిన సందర్భంగా టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతలు చేపట్టే నాయకులు ఎదగడం టీఎన్జీవో సంఘానికి గర్వకారణమన్నారు.

వ్యవస్థాపక అధ్యక్షులు మారం జగదీశ్వర్ గతంలో ఇరిగేషన్ శా ఖ రాష్ట్ర అధ్యక్షులుగా చూపిన నాయకత్వం స్థానంలో, కరీంనగర్ జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావుకు ఈ అవకాశం దక్కడం కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక గౌరవమని పేర్కొన్నారు. లక్ష్మణరావు క్రమశిక్షణ, సంఘనిబద్ధత, నిరహంకార వైఖరి, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చూ పిన నిజాయితీ, కృషి వంటి లక్షణాలు ఆయనను ఈ పదవికి అర్హుడిగా నిలబెట్టాయని తెలిపారు.

రాష్ట్ర కన్వీనర్గా ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా టీఎన్జీవో శాఖ తరఫున అభిలషించారు.అలాగే ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధిలో జిల్లా నాయకత్వం, ఉద్యోగుల ఐక్యత కీలకమని ఆయన అన్నారు. అంతేకాక, కరీంనగర్ జిల్లా ఉద్యమకారులకు, నాయకులకు పుట్టినిల్లు, నాయకులను తయారు చేసే కర్మశాల లాంటిదని, ఇ లాంటి నేల నుండి రాష్ట్ర స్థాయి నాయకులు వెలుగు చూడటం సహజంమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, గేజిటేడ్ అధికారుల సం ఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి, టీఎన్జీవోల సం ఘం కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు ఓంటేల రవీందర్ రెడ్డి, పట్టణ అ ధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, మహిళా నాయకులు ఇరుమల్ల శారద, సునీత, నాయకులు రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, పోలు కిషన్, నాగరాజు, కోమ్మేర శ్రీనివాస్ రెడ్డి, సతీష్ పటేల్, లవ కుమార్, వెలిచాలా శ్రీనివాసరావు, కరుణాకర్, అజ్గార్ అలీ, శంకర్, జగన్ గౌడ్, కమలాకర్, శంషుద్దీన్, నారాయణ, పూర్ణచందర్, రాజయ్య, విక్రమ్ సింగ్,తదితరులుపాల్గొన్నారు.