గాంధీభవన్‌లో సోనియా జన్మదిన వేడుకలు
* భారీ కేక్‌ను కట్‌చేసిన పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాం తి): కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోని యా గాంధీ జన్మదిన వేడుకలను సోమవారం గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు కట్ చేశారు. ఆ తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణలో రెండు పండుగలు.. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు, రెండోది సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు.
రాష్ట్ర సంస్కృతిని ప్రతిబిం బించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథకంలోకి నడిపిస్తామని తెలిపారు. తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్రమంత్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడంలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మెట్టు సాయికుమార్, వీరయ్య, మల్‌రెడ్డి రామిరెడ్డి, కల్వ సుజాత, అధికార ప్రతినిధి కొనగాల మహే శ్, రోహిన్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్‌పాల్గొన్నారు.
అమరవీరుల స్థూపానికి శుద్ధి
అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని కాంగ్రెస్ నేతలు శుద్ధి చేశారు. తెలంగాణ తల్లిని బీఆర్‌ఎస్ అడుగడుగునా అవమానిస్తున్నదని.. ఇప్పుడు అమరవీరుల స్థూపాన్ని కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అవమానపరిచారని వీహెచ్ విమర్శించారు. కేటీఆర్‌కు మహిళలు అంటే గౌరవం లేదని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ తల్లి బొమ్మతో కూడిన టీషర్టులు వేసుకుని అసెంబ్లీకి వస్తే సాధరంగా ఆహ్వానిస్తామన్నారు. కానీ ప్రభు త్వాన్ని అబాసుపాలు చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.






