జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
17-04-2026 03:36 PM
మార్కెట్ ఎండీలు కలిసిన ఎమ్మెల్యే
బోథ్,(విజయక్రాంతి): ఈ ఏడాది జొన్న మొక్కజొన్న పంటలు సాగు అధికంగా ఉన్నందున అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను కోరారు. ఈ మేరకు ముధోల్ ఎమ్మెల్యే రామారావుతో కలిసి హైదరాబాదులో ఎండిని కలవడం జరిగింది. బొత్ నియోజకవర్గంలో దన్నూర్, బోత్ నేరడిగొండ, ఇచ్చోడ,తాంసి, భీంపూర్, బజార్హత్నూర్లలో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించి పంటల కొనుగోలు చేపట్టాలని వారు ఎండికి వివరించారు.






