25-11-2025 12:08:47 AM
95/2 నుంచి 122/7.. ఇదీ మన ఇన్నింగ్స్ కుప్పకూలిన తీరు...గుహావటి టెస్టులో భారత్ బ్యాటింగ్ చూసిన తర్వాత సొంతపిచ్‌లపై మన బ్యాటింగ్ ఇంత చెత్తనా అనుకోకుండా ఉండరు...ప్రత్యర్థి జట్టు 489 రన్స్ స్కోర్ చేసిన పిచ్‌పై..వాళ్ల టెయిలెండర్లు సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన పిచ్‌పై.. మన బ్యాటర్లంతా కలిసి కనీసం సౌతాఫ్రికా స్కోరులో సగం కూడా కొట్టలేదు. ఫలితంగా సిరీస్ ఓటమిని ఖాయం చేసుకుంది. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్థేశించి ఉద్దేశంతో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా ఫాలోఆన్ కూడా ఇవ్వలేదు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని తప్పించుకుంటే మాత్రం అది అద్భుతమే.
గుహావటి, నవంబర్ 24 : రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టుబిగించింది. మూ డోరోజు కూడా సఫారీలు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. బ్యాటింగ్‌లో భారత్ చేతులెత్తేసిన వేళ భారీ ఆధిక్యాన్ని అందుకున్నారు. నిజానికి మూడోరోజు తొలి సెషన్‌లో భార త ఓపెనర్లు ఇన్నింగ్స్ ఆరంభించిన విధానం చూస్తే సఫారీల స్కోరుకు ధీటుగా రిప్లు ఇచ్చేలా కనిపించింది. ఓపెనర్లు జైస్వా ల్, రాహుల్ తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు.
రాహు ల్ ఔటైన తర్వాత సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన జైస్వాల్ హాఫ్ సెం చరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే జైస్వాల్, సాయి సుదర్శన్ వెంటవెంటనే ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ అనూహ్యంగా కుప్పకూలింది. నాలుగో స్థానంలో భారీ అంచనాలు పెట్టుకున్న జురెల్ డకౌట య్యాడు. కెప్టెన్ పంత్ కూడా ఫ్లాప్ అయ్యాడు. పంత్ ఔటైన విధానం చూ సాక ఫ్యాన్స్, మాజీలు మండిపడుతున్నారు.
టెస్టుల్లో కాసేపు ఓపికతో ఆడాల్సిన లాజిక్ మరిచిపోయి అవసరం లేకున్నా భారీ షాట్‌కు ట్రై చేసి వికెట్ సమర్పించుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా నిరాశపరిచాడు. ఇచ్చిన అవకాశా న్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బౌలింగ్‌లో నూ పెద్దగా ప్రభా వం చూపలేకపోయిన నితీశ్ బ్యాటింగ్‌లోకూ కూ డా ఫెయిలయ్యాడు. దీంతో భార త జట్టు కేవలం 27 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా పోరాడారు. జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వాషిం గ్టన్ సుందర్, కుల్దీప్ నెలకొల్పిన 72 పరుగుల భాగస్వామ్యం భారత్ ఇన్నింగ్స్‌లో అ త్యధికంగా నిలిచింది. ముఖ్యంగా సుందర్‌కు సపోర్ట్ ఇచ్చే క్రమంలో కుల్దీప్ టెస్టుల్లో ఎలా ఆడాలో అందరికీ చూపించాడు. ఏకంగా 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 48 రన్స్‌కు ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.
దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ పేసర్ యా న్సెన్ 6 వికెట్లు, హార్మర్ 3 , కేశవ్ మహారాజ్ 1 వికెట్ పడగొట్టారు. దీంతో సౌతాఫ్రికాకు 288 పరు గుల భారీ ఆధిక్యం దక్కింది. ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటకీ సఫారీ కెప్టెన్ బవుమా మాత్రం బ్యాటింగ్ చేసేందుకే మొగ్గుచూపాడు. భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచి ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని వ్యూహాత్మకంగా రెండో ఇన్నింగ్స్ కు దింపాడు.
మూడోరోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసిం ది. ప్రస్తుతం సౌతాఫ్రికా 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగోరోజు రెండు సెషన్లలో వేగం గా పరుగులు చేసే అవకాశముంది.
స్కోర్లు
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489 ఆలౌట్ ( ముత్తుసామి 109, జెన్సన్ 93 , స్టబ్స్ 49, వెరెన్నే 45, బవుమా 41 ; కుల్దీప్ యాదవ్ 4/115, బుమ్రా 2/75, జడేజా 2/94, సిరాజ్ 2/106 )
భారత్ తొలి ఇన్నింగ్స్: 201 ఆలౌట్ ( జైస్వాల్ 58, వాషింగ్టన్ సుందర్ 48, రాహుల్ 22; ఎన్సన్ 6/48,హార్మర్ 3/64).
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 26/0 ( రికెల్టన్ 13, మాక్‌ర్రమ్ 12 ).